![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -431 లో...... దీపని క్షమించమని అడగడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రావడం లేదని జ్యోత్స్న , పారిజాతం టెన్షన్ పడతారు. అప్పుడే శివన్నారాయణ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఏం జరిగింది.. కాంచన వాళ్ళు క్షమించారా అని పారిజాతం ఆత్రంగా అడుగుతుంటే.. లేదు ఏదో కండిషన్ పెట్టాడని శివన్నారాయణ అంటాడు.
ఏంటని పారిజాతం, జ్యోత్స్న అడుగుతారు. ఇంకా చెప్పలేదు రేపు వచ్చి చెప్తానన్నాడని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత శౌర్యని దీప పడుకోబెడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వస్తాడు. కండిషన్ ఏంటి బావ అని దీప అడుగుతుంది. రేపే చెప్తానని కార్తీక్ అంటాడు.మరుసటి రోజు ఉదయం పారిజాతం ఏదో లెక్కలు వేస్తూ ఉంటుంది. శివన్నారాయణ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్, దీప వచ్చి వారి రెగ్యులర్ వర్క్ చేసుకుంటుంటే శివన్నారాయణ పిలిచి ఏదో కండిషన్ అన్నావ్ ఏంటని అడుగుతాడు.
ఏదైనా సరే మేమ్ చేస్తాం తప్పుని సరిదిద్దుకుంటామని సుమిత్ర అంటుంది. దీప అమ్మనాన్నల చేతులు మీదుగా మళ్ళీ పెళ్లి చేయించండని కార్తీక్ అనగానే.. దీప అమ్మనాన్న లేరు కదా.. ఒక అనాథ కదా అని పారిజాతం అంటుంది. ఇంకోసారి నా భార్యని అలా అనకు అని పారిజాతంపై కార్తీక్ కోప్పడతాడు. అది మా వల్ల ఎలా సాధ్యం అవుతుందని సుమిత్ర అనగానే మరి వదిలేయండి అని కార్తీక్ అంటాడు. నా కూతురు చేసిన తప్పుని సరిదిద్దాలి లేదంటే ఆ నింద జీవితాంతం మోయ్యాలి ఇంకా ఏదైనా ఉంటే చెప్పు చేస్తామని సుమిత్ర అనగానే.. సరే దీపకి అమ్మనాన్న స్థానంలో మీరు ఉండి.. వేదమంత్రాల సాక్షిగా మాకు పెళ్లి చెయ్యండి అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |